‘ది రేపిస్ట్’ సినిమాకు గాను ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారం అందుకున్నారు అపర్ణా సేన్. నటిగా దర్శకురాలిగా స్క్రీన్ రైటర్ ఎడిటర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో నిలిచారు అపర్ణా సేన్. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకున్న అపర్ణా సేన్. 1981 లో ‘36 చౌరంగీ లేన్’ ఇంగ్లీష్ సినిమాలో రచయితగా డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. అపర్ణ సినిమాకు చేసిన కృషికి గాను 1986 లో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డు కూడా అందుకుంది అపర్ణా సేన్.