మేడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు,జాకెట్ లేకుండా వంటికి చీరె చుట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి తులసి గౌడ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ అందుకొన్నారు ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’ గా పిలిచే గిరిజన మహిళ తులసి గౌడ్. కర్ణాటక రాష్ట్రం అంకోలా తాలూకా హొన్నాలి గ్రామంలో పుట్టిన తులసి గౌడ్ 40 వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర, 1999 లో కన్నడ 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులే గాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు.