Categories
సౌందర్య ఉత్పత్తులు గడువు దాటితే చెత్తబుట్టలో పారేస్తూ ఉంటారు. కానీ వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫుట్ మ్యాట్ లు మురికి పడితే గోరువెచ్చని నీటిలో గడువు దాటిన ఫేస్ వాష్ వేసి నానబెట్టి కాస్త బ్రష్ వేస్తే కొత్తవి లాగా మెరుస్తాయి. మగ్గులో నీళ్లు ఫేస్ వాష్ షాంపు కలిపి వాహనాలు తుడిస్తే మురికిపోయి మెరుస్తాయి. పెద్ద స్పూన్ నిండా ఉప్పు వంటసోడా ఫేస్ వాష్ కలిపి ఈ మిశ్రమం తో మురికిగా ఉన్న కిచెన్, బాత్ రూమ్స్ టైల్స్ కడిగితే మురికి జిడ్డు వదిలిపోతుంది. దుస్తుల పైన పడిన కాఫీ టీ చట్నీ మరకలను కూడా నిమ్మరసం వంట సోడా ఫేస్ వాష్ కలిపిన నీళ్ళతో శుభ్రం చేయవచ్చు.