ప్రణీతను బాపు బొమ్మ అంటారు.ఈ అందమైన బాపు బొమ్మకు అంతకంటే అందమైన మనసు ఉంది.ఈ కరోనా సమయంలో అందరికంటే ముందే తన ప్రణీత ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం మొదలుపెట్టింది ప్రణీత.వలస కార్మికులకు ఆహారం అందించడంతో పాటు ఐదు వందల మంది పేద కుటుంబాల కోసం 2000 రూపాయల సరుకులు అందజేసింది.కరోనా కష్టాల్లో మనుషులకు అండగా ఉండేందుకు ప్రణీత చూపించిన చొరవ కు అందరూ ప్రశంసలు అందించారు.

Leave a comment