Categories
నిద్ర తగ్గిపోతే కళ్ళకింద చారలు వస్తాయని నీరసం వస్తుందని అనుకుంటారు కానీ అసలు నిద్రపోయే వేళల్లోనే ఆరోగ్యం దాక్కొని ఉందంటున్నారు పరిశోధకులు. రోజూ ఒకే సమయానికి పది, పదకొండు గంటల మధ్య నిద్రపోయే వారిలో ఆరోగ్య సమస్యలు తక్కువ అంటున్నారు. అందుకుగాను పగలు పని చేసి దాదాపు సమయానికి నిద్ర పోయే వాళ్ళ నిద్రవేళల్ని ఆహారపు అలవాట్లని క్షుణ్నంగా పరిశీలించారు. అయితే అర్ధరాత్రి వరకూ మేలుకొనే వాళ్లలోనే 25 శాతం మందికి గుండె జబ్బు ప్రమాదం గుర్తించారట. మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో గుండె సమస్యలు రావడానికి కారణం నిద్రవేళలు తగ్గటం వల్లనే అని గుర్తించారు పరిశోధకులు.