వంటల్లో రుచి కోసం మనం మసాలాలు వాడినట్లు ఇరాన్ లోని హార్ముజ్ దీవి ప్రజలు తమ వంటలకు కమ్మని రుచి రావటం కోసం ఆ దీవి లో దొరికే మట్టిని వాడతారు. హార్ముజ్ లో రంగు రంగుల రెయిన్ బో పర్వతాల నుంచి కిందకు జారే మట్టి లో ఇనుము తో పాటు 70 రకాల ఖనిజాలు ఉంటాయట. ఇది రుచిగానూ మంచి వాసనతో ఉండటంతో ఈ మట్టిని పోపుల డబ్బాలో పోసుకుని వంటల్లో వాడుకుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎర్రని రంగు సముద్రతీరాలను, అక్కడ దొరికే మట్టిని వాడి చేసే వంటకాలను ఎంతో ఇష్టపడతారట.

Leave a comment