Categories
శీతాకాలం స్నాక్స్ గా పల్లీలు తినమంటున్నారు శాస్త్రవేత్తలు. వాల్ నట్స్ వంటికి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని వింటూ ఉంటాం కానీ వాటి కంటే పల్లి లే గుండె కు ఎక్కువ మేలు చేస్తాయి. పల్లీల్లో కొవ్వు కేలరీలు ఎక్కువే కానీ ఇది తింటే స్థూలకాయం రాదు. పల్లీ లలో ఐసోఫ్లోవాన్స్ రిజర్వ్ ట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వీటితోపాటు కాపర్, నియాసిన్, ఫోలేట్, మ్యాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉంటాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో పల్లీలు తినే మహిళ లో టైపు-టు మధుమేహం తక్కువ గా వస్తుంది అని తేలింది. పల్లీలు కండరాల వాపు ను కూడా తగ్గిస్తాయి.