రక్త కణాలు ఉత్పత్తి కీ నాడీవ్యవస్థ పనితీరు కీ అవసరం అయ్యే విటమిన్ పులిసిన ధాన్యపు ఉత్పత్తుల్లో లభిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు ప్రొపియోని బ్యాక్టీరియ, ఫ్రెడెన్ రియిచి అనే బాక్టీరియని పరిశీలిస్తే అది 11 రకాల ధాన్యాల ఉత్పత్తిల్ని పులిసేలా చేసింది. పైగా ఈ ఒక్క బ్యాక్టీరియానే పులియటం  అనే ప్రక్రియ ద్వారా ధాన్యాల్లో బి12 ని ఉత్పత్తి చేయగలుగుతుంది అని గుర్తించారు.కనుక మనం తినే ఇడ్లీ, దోశ, డోక్లా వంటి పదార్థాల్లో బి12 అధికంగా ఉంటుందన్నమాట. కనుక ప్రతిరోజూ ఉపాహారంగా వీటిని తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు.

Leave a comment