ప్రియమైన వాళ్ళ పుట్టిన రోజుకో, పెళ్లిరోజుకో పూల బొకేలు పంపుతుంటారు ఎంత అందమైన బొకే అయినా రెండు రోజుల్లో వాడిపోతుంది.అలా వాడిని బొకేలు  రూపొందిస్తున్నారు  ఫ్లోరిస్ట్ లు.ఇలా వాడి పోకుండా ఉండేందుకు ముందుగా మందపాటి రేకులతో ఉన్న తాజా పూలను ఎన్నుకుంటారు.గ్లిజరిన్ మరికొన్ని గాఢ  తైలాలను  కలిపి ఒక ద్రావకం తయారు చేస్తారు.గులాబీలను ఆ మిశ్రమ ద్రావణంలో ఉంచటం వల్ల  అందులో సహజంగా ఉండే తేమ  పోయి ద్రావకం అందులోకి చేరుతుంది. అప్పుడా ఆ గులాబీలను ఓ గాజు కంటైనర్ లో గాని బాక్స్ లో కానీ చక్కగా అమరుస్తారు. అలాగే ముదురు నీలం ఉదా నలుపు వంటి గులాబీలను సృష్టించేందుకు ముందుగా వాటిలోని సహజమైన రంగు తొలగించి రసాయనం తో చక్కని కృత్రిమ రంగుల్నిఅద్ది వాటిని మరింత అందంగా చేస్తారు ఎన్ ఛంటెడ్ గార్డెన్ కలెక్షన్ పేరు తో తయారు చేసే పూలు కు ఎలాంటి సంరక్షణా అవసరం లేదు. ఈ బొకేలు రెండు మూడేళ్లు  తాజాగా కళకళలాడుతూ ఉంటాయి.

Leave a comment