Categories
పాపులర్ అవుతున్న ఒక ఫ్యాషన్ గురించి అవగాహన పెరిగిన కొద్దీ దాన్ని మరింత అందంగా తేలికగా ట్రెండ్ సెట్ చేసే విధంగా మార్పులు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూల జడ అందం తెలిశాక దాన్ని బంగారంతో, రాళ్లతో, వజ్రాలతో, ముత్యాలతో అలంకరించారు. ఇప్పుడు అంతకంటే తేలిగ్గా అందరూ కొనుక్కునేలా మగ్గం వర్క్ జెర్రీ జడలు వచ్చాయి. బ్లౌజులు చీరెలు మగ్గం వర్క్ లాగా అందమైన అల్లికతో మగ్గం వర్క్ జడలు అందుబాటులోకి తెచ్చారు డిజైనర్స్. వేసుకున్న దుస్తులు రంగును బట్టి నెట్టెడ్ మెటీరియల్ తో అందమైన మగ్గం వర్క్ జడలు వస్తున్నాయి. మోసే బరువు కూడా ఎక్కువ లేదు కనుక వేడుకల్లో ఈ జడ తప్పనిసరి ఫ్యాషన్ అయిపోయింది.