Categories
జానకీ అమ్మాళ్ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ భార్య. రెండేళ్ల పాటు మాత్రమే ఆమె రామానుజన్ తో కాపురం చేసింది. పదేళ్ళ వయసులో ఆమెకు 21 సంవత్సరాల రామానుజన్ తో పెళ్లయింది. పెళ్లి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ పుట్టెడు జబ్బుతో ఇండియాకు తిరిగి వచ్చి కొన్ని నెలలకే మరణించారు. అప్పటికి జానకి వయస్సు 20 రామానుజన్ 32 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడి కుట్టుపని వృత్తిగా చేసుకొని కాలం గడిపారు. గణితం లో ఎంతో కీర్తి గణించిన భర్త గొప్ప జీవితం ఆమె అనుభవించనే లేదు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ప్రభుత్వాలు ఆమెకు జీవితకాల పెన్షన్ ఇచ్చారు 1994 ఏప్రిల్ 13 వ తేదీన తుది శ్వాస విడిచారు జానకీ అమ్మాళ్.