గుస్సాడి సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ గాడ్ డాక్యుమెంటరీ తీసి గోండుల సాంప్రదాయాలు వారి జీవిత విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకురాలు జెన్నిఫర్ ఆల్ఫోన్స్. కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ఈ డాక్యుమెంటరీ ప్రశంసలు అందుకుంది. గోండులు ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ తీసింది జెన్నీఫర్. పూణేలో ఫిల్మ్ కోర్స్ చేసిన  జెన్నిఫర్ దర్శకుడు కృష్ణవంశీ తో కలిసి పనిచేసింది. వీధి బాలల పైన తీసిన  కచరా అనే షార్ట్ ఫిలిం ఆమెకు మూడు నంది అవార్డులు తెచ్చిపెట్టింది. స్ట్రేజర్స్ షార్ట్ ఫిల్మ్ కాన్స్ లో ప్రదర్శితమైంది. గుస్సాడీ చిత్రీకరణ సమయంలో తీసిన ఫోటోలతో చేసిన గుస్సాడీ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ గుస్సాడీ సంప్రదాయం పైన తీసిన తొలి కాఫీ టేబుల్ బుక్.

Leave a comment