Categories
పుట్టిన మరుక్షణం నుంచి తల్లికీ, బిడ్డకు రొమ్ము పాల అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధాన్ని శాశ్వతంగా కళ్ళముందు చూసుకోగలిగేవే బ్రెస్ట్ మిల్క్ జువెలరీ ట్రెండ్ అమెరికా కు చెందిన అల్మా పార్టిడా అనే ఆవిడ తన బిడ్డ అలెస్సా కు 18 నెలలపాటు రొమ్ము పాలు పట్టించి తల్లిగా తను సాగించిన ప్రయాణాన్ని కలకాలం గుర్తుండి పోయే మధుర జ్ఞాపకం గా ఉంచుకోవాలని అనుకుంది. రొమ్ము పాలతో ఆభరణాలు గురించి ఆలోచన వచ్చింది ఆమెకు.ఆమె తయారు చేసే బ్రెస్ట్ మిల్క్ జ్యువలరీ 60 డాలర్ల నుంచి 150 డాలర్ల ధర పలుకుతోంది. తాజా రొమ్ము పాలను స్టెరిలైజ్ చేసి పాడవకుండా రసాయనాలు జోడించి కొవ్వు నీరు విడగొట్టి కొవ్వు గట్టి పడే ఇంగ్రిడియంట్స్ నీ చేర్చి దానితో, కలకాలం ఉండే జ్యువెలరీ డిజైన్ చేస్తారు.