ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది గనక వైరస్ అంటుకొనే వీలున్న ప్రదేశాలు శానిటైజ్ చేయటం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసే వాళ్ళు స్టీరింగ్ ప్రతిరోజు శానిటైజ్ చేయాలి. ఎక్కువ సమయం హెడ్ ఫోన్స్ వాడితే వాటిని శానిటైజ్ చేసి తీరాలి. ఎక్కువ వాడే వీలున్న టీవీ, ఏసీ రిమోట్ తలుపు గడియలు శుభ్రం చేయాలి. ఇంటిల్లిపాది తాకే వీలున్న స్విచ్ బోర్డ్ లు కూడా అని శానిటైజ్ చేయాలి. కాలింగ్ బెల్ పలువురు తాకుతూ ఉంటారు ప్రతి సాయంత్రం కాలింగ్ బెల్ స్విచ్ శానిటైజ్ చేయాలి. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డ్ లు కూడా నిరంతరం చేతులు మారుతాయి కనుక వాటిని శానిటైజ్ చేయాలి.

Leave a comment