ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ సాధించింది. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో రెండో విమ్‌ నార్మ్, జనవరి 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించడం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయింది.

Leave a comment