Categories
ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే సరిపడా కాల్షియం కోసం పాల ఉత్పత్తుల పైన ఆధారపడుతూ ఉంటాం. కానీ రాగుల్లో క్యాల్షియం మోతాదు పాలలో కంటే ఎక్కువ. వంద గ్రాముల రాగుల్లో 344 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది రోజు వారి శరీరానికి అవసరమైన క్యాల్షియం కోసం రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. అధిక బరువు వదిలించుకోవాలన్న ఆహారంలో రాగులు ఉండాలి. రాగులు, సజ్జలలో క్యాలరీల సంఖ్య తగ్గటం తో పాటు మెటబాలిజం వేగం పెరుగుతుంది ఇవి చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతాయి.