Categories
![బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా వున్నాయి. విటమిన్-ఎ బీటా కెరటినాయిడ్స్ లాంటి ఫ్లావనాయిడ్స్ వున్నాయి. వీటి వల్ల వాపులు నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు ఊడ్చి పారేసే ఈ ఫ్లావనాయిడ్స్ వయస్సు తో పాటు వచ్చే కంటి , జలుబులను రాకుండా ఆపుతాయి. చర్మం ముడతలు పదనియదు. కండరాల్ల బలం కోసం, అలసి పొతే శక్తి సమకూర్చేందుకు, మెదడు పని తీరు మెరుగు పరచేందుకు గుమ్మడి బంగారం వంటి ఆహారం. దీన్ని ఏ రకంగా వండి తిన్నా ఇందులో పషకాలు ఎక్కడికి పోవు.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/pumpkin-1.jpg)
సహజసిద్ధంగా ఇంట్లో గుమ్మడి కాయ గుజ్జు తో తయారు చేసిన క్రీమ్ చర్మ సమస్యలను రానివ్వదు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుమ్మడి కాయ గుజ్జు ను మిక్సీలో వేసి మెత్తగా చేసి రసాన్ని వడకట్టాలి.దీన్ని ఒక గిన్నెలోకి తీసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో పొయ్యి పైన పెట్టాలి. ఐదు నిమిషాలు మరిగాక ఇందులో రెండు స్పూన్ల మొక్క జొన్న పొడి వేసి చల్లారాక చెంచా చొప్పున కలబంద గుజ్జు బాదం నూనె వేసి బాగా కలపాలి ఇట్లా తయారైన క్రీమ్ ని పొడి గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకుని పది రోజులు ఉపయోగించుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు ముఖం, మెడకు ఈ క్రీమ్ రాసి ఐదు నిమిషాలు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది. మొటిమలు మచ్చలు పోతాయి.