సహజసిద్ధంగా ఇంట్లో గుమ్మడి కాయ గుజ్జు తో తయారు చేసిన క్రీమ్ చర్మ సమస్యలను రానివ్వదు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుమ్మడి కాయ గుజ్జు ను మిక్సీలో వేసి మెత్తగా చేసి రసాన్ని వడకట్టాలి.దీన్ని ఒక గిన్నెలోకి తీసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో పొయ్యి పైన పెట్టాలి.   ఐదు నిమిషాలు మరిగాక ఇందులో రెండు స్పూన్ల మొక్క జొన్న పొడి వేసి చల్లారాక చెంచా చొప్పున కలబంద గుజ్జు బాదం నూనె వేసి బాగా కలపాలి ఇట్లా తయారైన క్రీమ్ ని పొడి గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకుని పది రోజులు ఉపయోగించుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు ముఖం, మెడకు ఈ క్రీమ్ రాసి ఐదు నిమిషాలు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది. మొటిమలు మచ్చలు పోతాయి.

Leave a comment