Categories
ఎండవేడికి ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలంటే కొన్ని పదార్థాలు చేర్చాలి.వెల్లుల్లి లో యాంటీ వైరల్ గుణాలుంటాయి. దీన్ని వంటకాల్లో చేర్చితే ఆహారం పాడవదు. అలాగే రుచి కోసం, పింక్, లేదా హిమాలయన్ సాల్ట్ వాడితే ఇవే సహజ నిల్వ పదార్థాలు గా పనిచేస్తాయి. సిట్రిక్ యాసిడ్ కూడా సహజమైన నిల్వ పదార్థమే. చల్లగా నైనా ఉడికించిన వైనా ఆహారం పైన కొద్దిగా నిమ్మరసం వేసే ఆహారం పాడవదు. లేదా కాస్త వెనిగర్ ను కలిపితే ఇది ఆహారాన్ని పాడు చేసే సూక్ష్మ జీవులను చంపటమే కాదు రుచిని పెంచటంలో సాయం చేస్తుంది.