Categories
కిచెన్ లో వంటకు వాడే ఎన్నో పదార్థాలు అప్పటికప్పుడు వాడుకోవాలి అవి తెల్లవారేసరికి పులిసి పోతాయి. చిన్న టిప్స్ తో కొన్ని పదార్థాలు పుల్ల పడకుండా చూడొచ్చు గోధుమపిండిని అతి చల్లని నీళ్ళతో కలిపితే మరుసటి రోజు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టక పోయినా పర్లేదు పాలిథిన్ కవర్లో గది ఉష్ణోగ్రత లో కూడా పిండి పాడవదు అలాగే ఇడ్లీ, దోశ పిండి పులిసి పోకుండా ఉండాలంటే రుబ్బిన పిండి బాగా చల్లగా ఉండే నీళ్లు కొన్ని పోసి కలుపుకోవాలి. ఈ పిండి నాలుగైదు రోజులు పులిసి పోకుండా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది.