Yamuna Menon ను ఇప్పుడు గోల్డెన్ గర్ల్ అంటున్నారు ఎర్నాకులం లోని ఉదయంపెరూర్ కు చెందిన యమున తను చదివిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఈ సంవత్సరపు స్నాతకోత్సవం లో 48 గోల్డ్ మెడల్ ప్రకటిస్తే వాటిలో 18 గెలుచుకొంది. బెంగళూర్ లోని ప్రతిస్టాత్మకమైన ఆ యూనివర్సిటీలో ఇంతవరకు ఏ బ్యాచ్ విద్యార్థి కూడా అన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకోలేదు ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లా యూనివర్సిటీ, ట్రినిటీ కాలేజ్ లో ఆమెకు ఉచిత స్కాలర్ షిప్ ఆఫర్లు ఇచ్చాయి.యమునా ట్రినిటీ కాలేజ్ ను ఎంచుకుంది.