నమ్ముతారో,నమ్మారో గాని రోజ్ వాటర్ సెనగపిండి ఇవే నా అందానికి కారణం. ఎక్కడికి వెళ్ళినా రోజ్ వాటర్ నాతో ఉండాలి. అలసిపోయాను అనిపించిన క్షణాల్లో తాజాదనం కోసం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటా అంటుంది నటి శ్రియ శరణ్. అందాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ఖర్చు చేయను. సింపుల్ గా అందరికీ దొరికే వస్తువులే వాడుకుంటాను. ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాస్తే బావుండు అనుకుంటే రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి స్ప్రే చేస్తే చాలు. ఇకపోతే సెనగ పిండి ప్యాక్ నా సీక్రెట్ పెరుగు, శెనగపిండి మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను మేకప్ అంటే ఐ లైనర్, కాజల్ అంతే. శక్తి ఉత్సాహం కోసం వర్క్ వుట్స్ చేశాను అంతే అది అయ్యంగార్ యోగ అంటుంది శ్రియ.

Leave a comment