సలోమి గౌర్ పేరున్న కామెడీ స్టార్ నజ్మా ఆపీ పేరుతో ఆమె పోస్ట్ చేసే వీడియోలకు 17 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నజ్మా ఆపీ క్యారెక్టర్ తో ఆమె చేసే వీడియో లో ఇద్దరు పిల్లలు మధ్యతరగతి ముస్లిం మహిళ గా తన సాధకబాధకాలు రాజకీయ సామాజిక అంశాలు తోటివారితో చెప్పుకునే అన్ని కబుర్లు ట్రెండింగ్ లో ఉంటాయి. దేశంలో నిరసనలు హక్కుల పోరాట ఉద్యమాలు బాలీవుడ్ నటీ నటులపై కామెడీ మిమిక్రీ వీడియోలకు మంచి స్పందన ఉంది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సలోమి గౌర్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది.

Leave a comment