Categories
ఎండలు మార్చేస్తున్నాయి తినే తిండి ఎంత ముఖ్యమో సౌకర్యంగా ఉండే దుస్తులు అంతే ముఖ్యం. ముఖ్యంగా ఏ డ్రెస్ అయినా మంచి మెత్తని కాటన్ ఐ ఉండాలి. సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లాలంటే మిడీ డ్రెస్సులు బాగుంటాయి. ఫ్రంట్ కాటెడ్ స్ట్రాప్స్ ఉన్న మిడ్డీస్ అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. విభిన్న ప్రింట్స్ తో రకరకాల డిజైన్లతో వచ్చే ప్రింటెడ్ ఫ్రాక్స్ ఏ వయసు వారికైనా బావుంటాయి. ప్రపంచ ఫ్యాషన్ లు ఎక్కడో ఒకచోట కనిపించే టై అండ్ డై దుస్తులు కలర్ ఫుల్ ప్రింట్స్ తో చుసేందుకు ఆహ్లాదంగా ఉంటాయి.ఫ్లోరల్ ప్రింట్స్ కూడా అందాన్నిస్తాయి. శాలువల దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్ వరకు బోహేమియన్ ప్రింట్స్ తో తేలికగా ఉండేవి ఎంపిక చేసుకుంటే ఈ వేసవికి సౌఖ్యంగా ఉంటాయి.