Categories
హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో మాస్టర్స్ చేసిన హేమాక్షి మేఘాని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ని స్థాపించారు. యువత దృష్టి జెండర్, లీడర్ షిప్, పాలిటిక్స్ ఈ మూడు అంశాలపై కేంద్రీకృతం కావాలని రాజకీయాలను కెరీర్ గా మలచుకునే విధంగా ప్రోత్సహించాలని వ్యక్తులు ఎన్నికల్లో నెగ్గితే ప్రజాస్వామ్యానికి మా వంతు సేవలు అందినట్లే అంటారు హేమాక్షి. విద్యార్థులకు ఆన్-లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతారు. పార్లమెంట్ సభ్యుల్లో 43 శాతం మందికి క్రిమినల్ రికార్డ్ ఉంది. ఈ పరిస్థితి పోవాలి. మా స్కూల్ లో 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వందల మంది శిక్షణ తీసుకుంటున్నారు. సామాన్యులు రాజకీయ రంగాన్ని కెరీర్ గా తీసుకోకపోతే దేశంలో చట్టాల రూపకల్పన చైతన్యవంతంగా ఉండదు అంటారు మేఘాని.