Categories
పిల్లలు ఎంతగానో ఇష్టపడే బార్బీ డాల్ ఇప్పుడు మహారాణి డ్రెస్ లో వెలిగిపోతోంది. ఏప్రిల్ 12వ తేదీన జరిగిన బ్రిటిష్ రాణి ఎలిజబెత్- 2 96 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె రూపంలో బార్బీ ని రూపొందించారు బార్బీ సంస్థ మ్యాటెల్.ఐవరీ తెలుపు గౌను, నీలం రంగు రిబ్బన్, తల పైన మెరిసే కిరీటంతో బార్బీ ఎలిజిబెత్ రాణి గా మెరిసిపోతోంది. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చిన స్త్రీలకు గుర్తుగా కొన్ని భారతీయులను రూపొందిస్తాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీ విడుదల చేశాం అంటున్నారు బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్.