Categories
Wahrevaa

ఈ నట్స్ సలాడ్స్ వేసవికి బెస్ట్

ఇది సలాడ్స్ కు సమయం. ఎండలు మండిపోతుంటే మంచి స్నాక్ బలాన్ని ఇచ్చేదిగా కావాలి. ఇప్పుడు నట్స్ , సలాడ్ ఎంచుకోవచ్చు. గింజల్లో, గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, నువ్వులు, జీడి పప్పు, పిస్తా పప్పు, ఆక్రూట్ అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇక సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ నూనె ఒక స్పూన్, నిమ్మరసం ఒక్క స్పూన్, తాజా తులసి ఆకులూ, ఉప్పు, మిరియాల పొడి, సరిపోయేలా కావాలి. ఇక కాయిగురలైతే కార్రోట్లు, కీర దోస కాయ, ముల్లంగి, టొమాటో, ఉల్లికాడలు తీసుకోవచ్చు. అన్ని కాయగురాల్ని చక్కగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. టొమాటోలు, ఉల్లికాడలు సాధ్యామైనంత చిన్నవిగా కట్ చేయాలి. అన్ని కాయగురాల్ని చక్కగా ఒక్క గిన్నె లో వేసుకుని పెట్టుకోవాలి. పాన్ లో డ్రై ఫ్రుట్స్ ని కొంచ గోధుమ రంగులోకి వచ్చే లా వేయించుకోవాలి. డ్రెస్సింగ్ కోసం తిసినవన్ని కలిపి కాయగూరల ముక్కాలా పైన వేసి అన్నీ బాగా కలపాలి పైన వేయించిన గింజలు డ్రై ఫ్రుట్స్ చల్లి, వెంటనే ఫ్రెష్ గా వున్న సలాడ్ ను తినేయాలి.

Leave a comment