పర్యావరణ పోరాట యోధురాలు బసంతి దేవి జీవితం ఒక స్ఫూర్తి దాయక గాధ పద్నాలుగేళ్ళ వయసులో భర్త చనిపోయాడు ఉత్తరాఖండ్ లోని లక్ష్మి మహిళా ఆశ్రమం లో చేర్పించారు. ఇల్లే లోకంగా ఉన్నా బసంతి దేవి కి లోకమే ఆశ్రమం అయింది. సమాజ సేవ నుంచి పర్యావరణం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. కోసి నది పరివాహక ప్రాంతం లోని గ్రామాల స్త్రీలు చెట్లు కొట్టేసి వంటచెరుకు గా వాడే వారు ఇలా చేస్తే పర్యావరణానికి ఎంతో ముప్పు అని ప్రచారం చేసింది. ఇప్పుడు అక్కడ స్త్రీలు ఎవరైనా స్త్రీలు చెట్లు కొట్టేందుకు వస్తే మూకుమ్మడిగా అడ్డుకుంటారు. కోసి నదిని రక్షించుకుందాం అన్న నినాదం తో బసంతి దేవి చేసిన పోరాటం ఆమెను యోధురాలిగా మార్చింది ఆజాదీ కి అమృతోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్ సిరీస్ సూపర్ సెవెన్ లో బసంతి దేవి జీవిత కథ కూడా ఉంది. 2016లో బసంతి దేవికి నారీ శక్తి పురస్కారం లభించింది.

Leave a comment