ఎంత ఖరీదైన కాస్మెటిక్స్ అయినా వాటి నిల్వ కాలం తక్కువే. సీల్ తీయకుండా చల్లని ప్రదేశంలో నిల్వ చేసిన కాస్మెటిక్స్ అది సీల్ తీయకపోతే రెండు మూడేళ్లు సురక్షితంగా ఉంటాయి. నూనె, వెన్న వంటివి కలిగి ఉండే కాస్మెటిక్స్ ఆ నూనెల మూలంగానే త్వరగా పాడైపోతాయి. సౌందర్య సాధన ల్లో కలిపే ప్రిజర్వేటివ్స్ కారణంగా ఆ కాస్మెటిక్స్ వాడినా వాడకపోయినా కాలంతో పాటు పాడవుతాయి. ఎంత ఖరీదైన కాస్మెటిక్ మూడేళ్లకు మించి వాడకూడదు. మేకప్ సామాగ్రి పైన పి ఏ జి (పిరియడ్ ఆఫ్ ఓపెనింగ్) కొన్ని నెంబర్ల పక్కన ఎమ్ (మంత్స్) అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. వాటిని బట్టి ఆ కాస్మెటిక్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని నెలలు మిగిలి ఉన్నాయో లెక్కించి చూసి వాడుకోవాలి. రంగు మారిన, వాసన మారిన లేదా మంచి వాసన రాకపోయినా వెంటనే పారేయాలి.
Categories