మండే ఎండల్లో చల్లని నూలు దోస్తులే వేడిని తట్టుకుని శరీరానికి హాయి ఇస్తాయి. సింపుల్ గా ఉండే కాటన్ తో కూడా పార్టీవేర్ దుస్తులుగా మార్చేస్తున్నారు డిజైనర్స్. ముఖ్యంగా ఇక్కత్, ఖాదీ వస్త్రాలు ఎలాంటి డిజైనర్ దుస్తులు రూపొందించేందుకు కైనా వీలుగా ఉంటాయి. మిరుమిట్లు గొలిపే గాఢమైన రంగులు ఇక్కత్ తో ఎన్నో వినూత్నమైన డిజైన్లు వచ్చాయి. ట్రీజర్స్ ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్,గా ఇక్కట్ రూపాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చక్కని ఖాదీ తో కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దేశవిదేశాల్లో మన దేశీయ డిజైన్స్ ప్రత్యేకతలంటే ఈ రెండు రకాల వస్త్ర శ్రేణిలోనే సాధ్యం. ఇక్కత్ తో తయారైన వస్త్రాలు సాంప్రదాయ డిజైన్ లలోనే ఆధునికంగా అనిపిస్తాయి.

Leave a comment