Categories
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISASF) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్‌లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది రాపోలు సురభి భరద్వాజ్.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సురభి తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి.. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది సురభి .