మహిళలను,  ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయి అంటుంది మిలిందా. 1987లో మైక్రోసాఫ్ట్ లో చేరి 1994లో బిల్ గేట్స్ పెళ్లాడింది మిలిందా. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవ పైన దృష్టిపెట్టారు. 2000 లో బిల్ గేట్స్ తో కలిసి 17 బిలియన్ డాలర్లతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. వేగంగా వెళ్లాలి అంటే ఒక్కరే వెళ్లాలి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుని వెళ్ళాలి అంటుంది మిలిందా. ఇప్పుడు మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థ దీనికి చైర్ పర్సన్ మిలిందానే.

Leave a comment