వేసవిలో సబ్జా, కొబ్బరినీళ్ళ పానీయం వివిధ రకాల పోషకాలు అందించి డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. గ్లాస్ కొబ్బరి నీళ్లలో అరవై క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా కొబ్బరి నీళ్ళు మంచివే. కొబ్బరి నీళ్ళలో కొద్దిగా చియా గింజలు, సబ్జా గింజలు కానీ వేసి తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. సబ్జా గింజల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంచేందుకు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్ళలో ఓ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కానీ వేసి రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి తాగితే రుచి,ఆరోగ్యం కూడా.

Leave a comment