Categories
ఈ వేసవి చివరలో హవాయి లో లాంతర్న్ ఫ్లోటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది భౌతికంగా దూరమైన ఆత్మీయులను తలుచుకుంటూ వారికి చేరుతాయని నమ్మకం తో రాసిన దీపాలను సముద్రంలోకి వదిలి పెడతారు జపాన్ లోని టోరో నాగాషి లాగానే ఇక్కడ హవాయి ద్వీపం లో వేడుకలు స్థానిక సంప్రదాయాల మేళవించి జరుపుకుంటారు. ఇక్కడ షిన్యోఎన్ ఆలయం దగ్గర దీపాలు ఉచితంగా ఇస్తారు. వాటిపైన సందేశాలు రాసి సముద్రంలోకి వదిలేస్తారు. వేల సంఖ్యలో వెలిగే దీపాల కాంతుల్లో పై లోకాల్లో ఉన్న ఆత్మీయులను తలచుకుంటారు ప్రజలు.