Categories
Soyagam

అతిగా కనుబొమ్మల జోలికి వెళ్లొద్దు.

తీరైన మొహం అంటే చక్కని కనుబొమ్మలు, నవ్వే కళ్ళు ఇలా చాలా వరుసలో ఉంటాయి. ఈ మధ్య కలంలో యుక్త వయస్సు కుడా రాకముందే ట్రిమ్చేయించడం త్రేడ్డింగ్, అస్తమానం తీర్చిదిద్దడం, షేడ్స్ వేయడం, టింట్స్ వాడటం వల్ల చాలా తొందరలోనే కనుబొమ్మల పైన వెంట్రుకలు రాలిపోయి పల్చగా అయిపోతాయి. అధికంగా సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నా, హెవీ మేకప్ వేసుకున్నా ఇలా కనుబొమ్మల వెంట్రుకలు పల్చబడే ప్రమాదం వుంది. అంచేత చక్కని కనుబొమ్మల వెంట్రుకలు కాపాడుకునేందుకు అయినా అతిగా వాటి జోలికి పోవద్దు అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ప్రతి రోజు కనుబొమ్మల వెంట్రుకలపై ఆలివ్ లేదా కొబ్బరి నూనె, ఆముదం తో మసాజ్ చేయమంటున్నారు. అంచి పోషకాహారంతో సహజమైన సౌందర్యం ఎక్కడికీ పోదు.

Leave a comment