మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే  కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. యోగా తో అలర్జీ పై పోరాడే శక్తీ శరీరానికి సమకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మనసుకి కావాల్సిన రిలాక్సేషన్ అందుతుంది. డిప్రెషన్ తోబాధపడేవారికి యోగా మంచి ఉపశమనం. ఏ రకంగా చూసినా యోగాతో మెరుగైన ప్రయోజనాలున్నాయి.

 

 

Leave a comment