హృదయ కారపు ఆకులతో పాకే తిప్పతీగను ఆయుర్వేదంలో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారు.టెర్మినాయిడ్లు, ఆల్కలాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు పీచు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ తీగలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా వాడుతున్నారు దీన్ని ఇన్ఫెక్షన్ సంబంధిత జ్వరాలు, డయేరియా, డయాబెటిస్ నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలతో పాటు కోవిడ్ కు వాడచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఒమిక్రాన్ ని కొంత వరకు అడ్డుకుంటుంది అంటున్నారు. కోవిడ్ సోకి ఇంట్లోనే ఉండే వాళ్ళు దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కోలుకుంటారట మార్కెట్ లో తిప్పతీగ టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి.

Leave a comment