Categories
బాంగ్లాదేశ్ కుస్తియా జిల్లా లోని షిములియా గ్రామం యూట్యూబ్ విలేజ్ గా ఫేమస్ అయింది. షిములియా గ్రామ మహిళలు స్వయంగా కెమెరా హ్యాండిల్ చేసి షూటింగ్ ఎడిటింగ్ చేసి,చక్కగా వంటలు వండి తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మీర్ పూర్ లో ఐటి కంపెనీ నడిపే లిటన్ అలీ స్వగ్రామం ఇది ఊరికి వచ్చినప్పుడల్లా ఊరి అందాలు షూట్ చేసి యూట్యూబ్ లో లోడ్ చేసేవారు ‘ఎరౌండ్ మి బిడి’ పేరుతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి ఈ ఛానల్ ని ఉపాధికి ఉపయోగపడే ఛానల్ గా మార్చుతాను. ఉరి మహిళలు ఈ ప్రాజెక్ట్ లో చేరి విభిన్నమైన వంటలు వండుతూ, ఏనాటివో,ప్రాచీన వంటకాలు చూపెడుతూ దాన్ని సక్సెస్ చేశారు. మన దేశం తో సహా,పాకిస్తాన్,ఇండోనేషియా దేశాల్లో కూడా యూట్యూబ్ విలేజ్ ఒక ట్రెండ్ గా మారింది.