ఎప్పుడు ధగధగా మనే వెండీ నాగలేనా ? ఆఫీస్ కీ,కిట్టి పార్టీ కి వెళ్లేందుకు చక్కని అందమైన నగలు ఇంకేమైనా దొరికితే బాగుండు అనుకొనే వాళ్ళ కోసం ఆక్సిడైజ్డ్ జువెలరీ అందుబాటులో ఉంది ఆక్సీకరణ ద్వారా వెండి రంగుని కాస్త తగ్గించి నల్లని మెటల్ లాగా మారుస్తారు ధర కాస్త తక్కువే. కానీ అద్భుతమైన డిజైన్స్ లో వీటిని తయారు చేస్తారు. చీరలు, చుడీదార్లు,లెహంగాలు,ఓణీలు ఈ ఏ డ్రెస్ ఐనా నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి కంఠాభరణాలు,చెవులకు హ్యాంగింగ్స్ గాజులు వడ్డాణాలు ఇలా అన్ని రకాల ఆభరణాలు అన్ని వయసుల వారికీ అందంగా నచ్చేలా ఉంటాయి.

Leave a comment