Categories
గుజరాత్లోని మారుమూల గ్రామం అంకోట్ లో పుట్టిన మిత్తల్ గోహిల్ ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చదువు కొని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడటమే కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళల జీవితాలను తీర్చిదిద్దింది. 2017 లో దేశాయి ఫౌండేషన్ లో చేరిన మిత్తల్ రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయింది. ఫౌండేషన్ టీమ్ తో కలిసి యూపీ,మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లోని 30 మంది మహిళలు బాలికలకు వృత్తిపరమైన శిక్షణ కంప్యూటర్ ట్రైనింగ్ డ్యూటీ కోర్సుల్లో శిక్షణ స్టార్టప్ కోసం రుణ సహాయం అందజేసింది. మహిళలు, బాలికల జీవన ప్రయాణం పెంచడం ఆమె లక్ష్యం.