Categories
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీ ఆర్ ఎఫ్) లో మహిళల సంఖ్య పెంచాలన్నది లక్ష్యం గా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీస్ లలోని రక్షణ రిజర్వ్ ఫోర్స్ ల్లోని మహిళలను వీటిల్లోకి చేరమని గత సంవత్సరం పిలుపు ఇచ్చింది. అమర్నాథ్ యాత్రికులు వరదల్లో చిక్కుకున్న సమయంలో, అస్సాం వరదల్లో ఈ మహిళా బృందాలు సేవలు అందించాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా కాన్పు చేయడం ఆపద లో వైద్య సేవలు అందించడం కూడా వీరి విధుల్లో ఒకటి. సాటి మహిళలు సంరక్షకులుగా ఉంటే బాధితులకు ధైర్యంగా ఉంటుంది. దేశంలోని ప్రతి ఎన్టీ ఆర్ ఎఫ్ బృందంలో 10 శాతం మహిళలు లెక్కన రెండేళ్లలో కనీసం ఈ బృందాల్లో చేరనున్నారు.