ఎంత  వయసొచ్చినా  ఆ ఏజ్  తాలూకు ఏ  లక్షణం   కనిపించకుండా మాయచేసేది  చక్కని ఆహారం. యాంటీ  ఆక్సిడెంట్స్ ఆధారంగా  వుండే పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు, డ్రై  ఫ్రూట్స్, పాలు , చీజ్, పన్నీర్, పప్పులు ఇవన్నీ  తినాలి. ముఖ్యంగా మన దేశపు ఔషధ  గుణాలు పుష్కలంగా  వున్న   హెర్బ్స్ , పునరుత్తేజాన్ని ఇచ్చే  మైక్రోబియల్స్  గుణాలు వున్న పానీయాలు  తాగడం వళ్ళను, ఉసిరి, జమ , కమలా , నారింజ , బొప్పాయి  పండ్లు  తీసుకోవాలి. డ్రై  ఫిగ్స్, రైజన్స్, ఖర్జురాలు , పీచు, కాల్షియం, మెగ్నీషియం , ఐరన్ , విటమిన్ సి కి చక్కని ఆధారాలు . అలాగే మంచి ఆహారం తో పాటు క్రమం తప్పని  క్రమశిక్షణ తో కూడిన వ్యాయామం  తోడైతే శరీరం మాట వింటుంది.

Leave a comment