Categories
పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్ధాలు జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోంది రిని మెహతా తమ్ముడు రోహన్ మెహతా తో కలిసి ‘పిటారా’ బ్రాండ్ కు రూపకల్పన చేసింది. పిటారా అంటే ట్రెజరీ బాక్స్ అని అర్థం జైపూర్ కు చెందిన రిని మెహతా టెక్సటైల్స్ డిజైనర్ గా పని చేసింది. ఆమె ప్రారంభించిన పిటారా బ్రాండ్ తో చేసిన ఉత్పత్తులను రాజస్థానీ కళా సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం లాగా ఉంటాయి. బగ్రు,జర్దోసి ప్రింట్లు ఎంతో బావుంటాయి. రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు కలిపి రోజువారీ వాడుకునే వస్తువులు తయారు చేస్తారు.