జాతీయోద్యమం లో జైలుకు వెళ్లిన ద్వితీయ మహిళగా ప్రథమ ఆంధ్ర మహిళ గా దువ్వూరి సుబ్బమ్మ గారికి చరిత్రలో సముచిత స్థానం ఉంది. 1880 లో కోనసీమలోని ద్రాక్షారామం లో పుట్టిన సుబ్బమ్మ గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో విదుషీమణి. చిన్నతనంలోనే పెళ్లయింది సంపూర్ణ స్వాత్రంత్య్ర సంపాదనే లక్ష్యంగా బులుసు సాంబమూర్తి గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇచ్చారు. సనాతన విద్యాలయం పేరుతో జాతీయ విద్యాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నడిపించిన ప్రతి కార్యక్రమం లోనూ పాల్గొన్నారు.