ఈ కరోనా సమయంలో ఐస్ ల్యాండ్ ప్రధాని  కత్రిన్ జాకబ్స్ డాట్టిర్. ఆ దేశ ప్రజలకు తల్లి పాత్ర పోషించారు మూడున్నర లక్షల కు ఎక్కువగా ఉన్న ఆదేశ జనాభాలో 12 శాతం మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య కేవలం పది …. కరోనా వైరస్ ప్రమాదం అర్ధం చేసుకొని ఆరోగ్య శాఖాధికారులు అంటువ్యాధి నిపుణులు శాస్త్రవేత్తల తో సమీక్షలు నిర్వహించారు. ట్రేసింగ్ యాప్ తో కరోనా సోకిన వ్యక్తి ని తక్షణం గుర్తిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు ఐస్ ల్యాండ్ లో ఈ నెల నాలుగు నుంచి లాక్ డౌన్ సడలించారు. పాఠశాలలు,కార్యాలయాలు తెరుచుకొన్నాయి. పర్యాటక,వ్యాపార రంగాలు పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అంటున్నారు కత్రిన్ జాకబ్స్.

Leave a comment