మాస్క్ ల చెట్టును సృష్టించింది అమెరికాకు చెందిన డెబ్ సిగ్గిన్స్. కరోనా  విజృంభణతో తల్లడిల్లుతున్న ఆ దేశంలో వైద్యులకు కూడా రక్షణ పరికరాలు కావాల్సినన్ని లేవు.వాటిని ఎవరైనా సొంతంగా తీసుకొనిపోయి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు.దానితో డెబ్ ఇంట్లో సొంతంగా మాస్కులు కుట్టి తమ వీధిలోని  ఒక చెట్టును గివింగ్ ట్రీ గా మార్చేసి తాను తయారు చేసిన మాస్కులకువాటిని తగిలిస్తుంది.  అవసరం ఉన్నవారు ఎవరైనా వాటిని ఉచితంగా తీసుకోవచ్చు ఎవరు ఎన్ని తీసుకున్న పర్లేదు. డెబ్ సిగ్గిన్స్మాత్రం ప్రతి రోజు మాస్క్ లు కుట్టటం గివింగ్ ట్రీ కి తగిలించటం మాత్రం మానలేదు.

Leave a comment