Categories

అహ్మదాబాద్ లోని సబర్మతీ నదీ తీరంలో వెలసిన గాంధీ ఆశ్రమం ఆయన పాటించిన విలువలకు అద్దం వంటిది. మహాత్ముని పోరాట ఉద్యమం కళ్లకు కనిపిస్తుంది. ఆవులు మూగ జీవాల పెంపకం ఖాదీ తయారు వంటివి ఆయన చేసిన ప్రయోగాలు ఇక్కడే మొదలయ్యాయి 1917 నుంచి 1930 వరకు ఆశ్రమం స్వాత్రంత్య పోరాటానికి వేదికగా నిలిచింది. గాంధీజీ చేతిరాత కథనాలు పెయింటింగ్స్ ఆయన దుస్తులు వాడిన వస్తువులు చూసేందుకు ఈ ఆశ్రమాన్ని వేలాది మంది భారతీయులు సందర్శిస్తారు. ఈ సబర్మతీ ఆశ్రమం లో గాంధీజీ పై అధ్యయనం పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుంది.