ఎండ, చెమటతో మొటిమలు కూడా ఎక్కువే.ఈ వేసవిలో మొటిమలు తగ్గేందుకు బొప్పాయి గుజ్జుతో మొహం మసాజ్ చేయాలి. ఇందులోనే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. అలాగే పండిన దోస పండు గుజ్జుతో ప్యాక్ వేసుకోవాలి.తేనెతో ప్యాక్ వేసిన మొటిమలు తగ్గిపోతాయి. మూడు వంతులు యాపిల్ సిడర్ వెనిగర్ తో నాలుగు వంతులు నీళ్లు కలిపి ముఖం కడుక్కోవాలి.ఆరిపోయాక కడిగేయాలి. ఈ మిశ్రమం చర్మాన్ని టోన్ చేస్తుంది ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.

Leave a comment