తమిళనాడులోని కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కట్టి కుట్టు సంఘం పురాతన కళా సంప్రదాయమైన ఈ నృత్యాన్ని సజీవంగా ఉంచేందుకు అంకితం అయింది. పురుషులకే పరిమితం అయిన ఈ సంప్రదాయ నృత్యాన్ని భారతి తమిళ సనన్ తిలంగావతి పళని వంటి కళాకారులు ఈ నృత్యాన్ని ఎంతోమందికి నేర్పిస్తున్నారు. తిలంగావతి పళని శ్రీకృష్ణ కుట్టి పంజు కుజు పేరుతో పాఠశాల నడుపుతుంది. ఈ క్లిష్టమైన నృత్యానికి మహిళలు అర్హులు కారు అనే భావన తొలగిపోయేలా మహిళలలో కళా ప్రతిభను వెలుగులోకి తెచ్చింది తిలంగావతి పళని. ప్రతి సంవత్సరం కాంచీపురంలో కట్టి కట్టు సంఘం పెద్ద ఉత్సవం నిర్వహిస్తుంది.

Leave a comment