ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి చైల్డ్ ట్రాఫికింగ్ నిరోధానికి కృషి చేశారు పల్లవి ఘోష్. అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, భూటాన్,బంగ్లాదేశ్, మయన్మార్ తో సహా దేశవ్యాప్తంగా పదివేల మంది పిల్లలను రక్షించగలిగారు.చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా బెదిరింపులకు లొంగకుండా ఎన్నో వర్క్ షాప్ లు నిర్వహించి ఈ సమస్య పై అవగాహన కల్పించారు. 75 వేల మంది ఈమెతో కలిసి పనిచేస్తున్నారు. అస్సాం లోని లుమ్డింగ్ పట్టణంలో పుట్టిన పల్లవి ఢిల్లీ కి చెందిన ఒక సంస్థలో ఇలాంటి రేనులను శోధించే రీసెర్చ్ ఆఫీసర్.

Leave a comment